Responsive Header with Date and Time

హానీ రోజ్‏కు పెరుగుతున్న మద్దతు.. WCC సపోర్ట్.. అసలేం జరిగిందంటే..

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-08 12:26:42


హానీ రోజ్‏కు పెరుగుతున్న మద్దతు.. WCC సపోర్ట్.. అసలేం జరిగిందంటే..

తెలుగు వెబ్ మీడియాన్యూస్: మలయాళీ నటి హానీరోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్ 75 (4), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు హానీరోజ్ గురించి తాను ఎలాంటి చెడుగా ఏమీ మాట్లాడలేదని బాబీ వివరణ ఇచ్చాడు. తన మాటలతో హానీ రోజ్ ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు.


సోషల్ మీడియాలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఇటీవల మలయాళీ నటి హానీరోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 30 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హానీరోజ్ వాంగ్మూలాన్ని కేరళ పోలీసులు తీసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు నటి హాన్ రోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) మద్దతు తెలిపింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ లో హానీరోజ్ ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు హనీరోజ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.


హనీరోజ్ న్యాయ పోరాటాలకు పూర్తిగా మద్దతు ఇస్తామని.. అన్ని రకాల న్యాయ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అమ్మ సంఘం ప్రకటించింది. మరోవైపు హనీ రోజ్‌కి మద్దతుగా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) నిలిచింది. . “బి విత్ హర్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో హనీ రోజ్ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా డబ్ల్యుసిసి తన మద్దతును తెలిపింది. భారత న్యాయ వ్యవస్థ అనుమతించని ఎలాంటి దుస్తులు ధరించి ఆమె బహిరంగంగా కనిపించలేదని.. ప్రతి వ్యక్తి తమ సొంత ఆలోచనల ప్రకారం తమ సొంత చట్టపరమైన కోడ్‌లను రూపొందించుకోవడానికి ఆమె బాధ్యత వహించదని పేర్కొంటూ హనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నోట్‌ను WCC షేర్ చేసింది. .


ఒక నటిగా ఫంక్షన్లకు వెళ్లడం తన ఉద్యోగంలో భాగమని.. తన దుస్తులు లేదా తన గురించి వ్యక్తిగతంగా విమర్శించడం, జోక్స్ వేయడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ మనోభావాలు దెబ్బతినేలా.. వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా పోస్టులు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపింది హనీరోజ్. సోషల్ మీడియాలో తనలాగే ఎంతో మంది మహిళలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: