Responsive Header with Date and Time

ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తి ఇతనే.. ఒక రోజు జీతం దాదాపు రూ.48 కోట్లు!

Category : వ్యాపారం | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-01-08 13:38:36


ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తి ఇతనే.. ఒక రోజు జీతం దాదాపు రూ.48 కోట్లు!

TWM News:-[12:54 pm, 8/1/2025] Srav: ప్రపంచంలో అత్యధిక జీతం ఎవరికో తెలుసా? అన్‌స్టాప్ నివేదిక ప్రకారం.. అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి భారతీయుడే. ఇది మన దేశానికే గర్వకారణం.. ఈ వ్యక్తి నెల జీతం 1458 కోట్ల రూపాయలు. వార్షిక ప్యాకేజీ 17 వేల 500 కోట్ల రూపాయలు. రోజుకు 48 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు..ప్రపంచంలోనే అత్యధిక వేతనాల పరంగా జగ్దీప్ సింగ్ పేరు ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఆయన పేరు వైరల్‌ అవుతోంది. భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త జగదీప్ సింగ్ రోజువారీ వేతనం రూ. 48 కోట్లు. అంటే వార్షిక వేతనం రూ. 17,500 కోట్లు. నెల జీతం 1458 కోట్లు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరు. ఏప్రిల్ 2023 వరకు పిచాయ్ వార్షిక వేతనం రూ.1663 కోట్లు. మొత్తం అలవెన్సులు కలిపితే ఆయన వార్షిక వేతనం సుమారు రూ.1854 కోట్లు. అంటే దాదాపు రూ. రోజుకు 5 కోట్లు.

 అయితే జగ్దీప్‌ సింగ్‌ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా గుర్తింపు పొందారు. జగ్దీప్ సింగ్ క్వాంటమ్‌స్కేప్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలపై పరిశోధన చేస్తుంది. ఎలోన్ మస్క్ కంటే ఈ కంపెనీ సీఈవో జన్‌దీప్ సింగ్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతని ఒకరోజు జీతం చాలా కంపెనీల వార్షిక టర్నోవర్. జగ్దీప్ సింగ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తి చేశాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. Quantum Scape కంపెనీని స్థాపించడానికి ముందు, అతను వివిధ కంపెనీలలో కీలక స్థానాల్లో పనిచేశారు.


ఇతను 2010లో ఈ కంపెనీని స్థాపించాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల (EV) శక్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఛార్జింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. సింగ్ నాయకత్వం అతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ కంపెనీలో పెట్టుబడిదారులలో వోక్స్‌వ్యాగన్, బిల్ గేట్స్ ఉన్నారు. క్వాంటమ్‌స్కేప్‌ని స్థాపించడానికి ముందు, సింగ్ అనేక కంపెనీలలో వివిధ నాయకత్వ పాత్రలలో 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు.జగ్దీప్ సింగ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి BTech, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు. సింగ్ జీతం ప్యాకేజీలో రూ. 19,000 కోట్లు (సుమారు $2.3 బిలియన్లు) స్టాక్ ఆప్షన్‌లలో ఉన్నాయి. అయితే, ఫిబ్రవరి 16, 2024న సింగ్ క్వాంటమ్‌స్కేప్ CEO పదవికి రాజీనామా చేసి, శివ శివరామ్‌కు కంపెనీ పగ్గాలను అప్పగించారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: