Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-07 12:30:54
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్, నాగార్జున కలయికలో కుబేర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ జానర్ లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శేఖర్ కమ్మల గత సినిమాలకు భిన్నంగా ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన టీజర్ ద్వారా స్పష్టమైంది.కుబేరలో ధనుష్ పాతర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అర్థమవుతుంది. రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వాస్తవానికి 2024 డిసెంబర్ లో రిలీజ్ కావాలి. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాకపోవడంతో 2025కి పోస్ట్‌పోన్ చేశారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కుబేరను రిలీజ్ చేస్తారనుకున్నారు.కానీ ఇప్పుడు ఆ టైమ్ కు కూడా సినిమా రిలీజ్ అయ్యేట్టు కనిపించడం లేదు. షూటింగ్ ఇంకా ఎక్కువ పెండింగ్ ఉండటంతో సినిమా మరోసారి వాయిదాపడే అవకాశాలుననట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే శేఖర్ కమ్ముల తాను చెప్పిన టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తాడు కానీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి కావడం, బడ్జెట్ కూడా రూ.100 కోట్లు పెట్టడంతో శేఖర్ కమ్ముల మరింత కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.