Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-07 12:28:06
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : విక్టరీ వెంకటేష్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి, సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంక్రాంతికి వస్తున్నాం విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.
ఓ ఇన్ప్లూయన్స్ వున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది, దాని గురించి వార్తలు బయటికి వస్తే ప్రభుత్వమే కూలిపోతుంది. దినిని నుంచి గట్టెక్కించగల ఎక్స్ పర్ట్ ని ప్రభుత్వం ఆశ్రయిస్తుంది. వెంకటేష్ ఎక్స్ పోలీసు, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. అతని భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్ )తో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు. వెంకటేష్ మాజీ ప్రియురాలు, పోలీసుగా ఉన్న మీనాక్షి చౌదరి కిడ్నాప్ కేసును ఛేదించడంలో సహాయం కోసం అతనిని సంప్రదించడంతో వారి ప్రశాంత జీవితానికి ఇబ్బంది కలుగుతుంది. వెంకటేష్ మిషన్‌ను చేపట్టడానికి అంగీకరిస్తాడు, అయితే భాగ్యం సపోర్ట్ తో అతను ఆపరేషన్‌లో భాగం కావాలని పట్టుబటతాడు.దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రం భగవంత్ కేసరిలో విలక్షణమైన ఎంటర్‌టైనర్ తో ఆకట్టుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంతో మరో సరికొత్త అనుభూతిని అందించారు. ట్రైలర్‌లో సూచించినట్లుగా ఈ చిత్రం ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాను బ్లెండ్ చేస్తుంది. వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ అందించారు, కామెడీ, ఫ్యామిలీ డైనమిక్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆదరగొట్టారు. ఐశ్వర్య రాజేష్ ఆదర్శ భార్యగా ఆకట్టుకుంది, మీనాక్షి చౌదరి వెంకటేష్ మాజీ ప్రేయసిగా, టఫ్ పోలీసుగా కథాంశానికి డెప్త్ జోడించారు. ఈ ట్రై యాంగిల్ రిలేషన్ కథకు ఆసక్తికరమైన డైనమిక్‌ని తెస్తుంది.