Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-07 11:32:31
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్ తన తర్వాతి సినిమాను వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కృష్ణ తో చేయనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే అఖిల్ ఈ సినిమాను సైలైంట్ గా పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 1992 స్కామ్ తో సెన్సేషన్ సృష్టించిన ప్రతీక్ గాంధీ ఒకరు కాగా, కోలీవుడ్ యాక్టర్ విక్రాంత్ ఇంకొకరు. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలని మేకర్స్ మధ్య తర్జన భర్జన నడుస్తోందని సమాచారం. వాస్తవానికి వారిద్దరూ అఖిల్ కు సరిపోయే నటులే. మరి ఇద్దరిలో అఖిల్ ను ఎదిరించే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి. ప్రతీక్ గాంధీ బాలీవుడ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో అతడు అఖిల్ సినిమాకు డేట్స్ కేటాయించడం కష్టమే అవుతుంది. కానీ కోలీవుడ్ నటుడు విక్రాంత్ తో ఆ సమస్య లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.