Responsive Header with Date and Time

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ - డ్రాఫ్ట్ రూల్స్ ఇవే

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-01-06 13:38:14


డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ - డ్రాఫ్ట్ రూల్స్ ఇవే

TWM News:-18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదాలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పొందుపర్చింది. ఈ మేరకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

ఫిబ్రవరి 18 వరకు సలహాలు స్వీకరణ

MyGov పోర్టల్ ద్వారా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా నిబంధనలపై ప్రజాభిప్రాయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కోరింది. ఈ ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలుంటే mygov.inలో తెలియజేయాలని సూచించింది. ఫిబ్రవరి 18 వరకు సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపింది. ఆ తర్వాత ప్రజలు, పలు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

కేంద్ర మంత్రి ట్వీట్

ఈ క్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్​లో పోస్ట్ చేశారు. \"డ్రాఫ్ట్ డిజిటల్ ప్రొటెక్షన్ డేటా బిల్లు నియమాలను సంప్రదింపుల కోసం విడుదల చేస్తున్నాం. దీనిపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలి\" అని పేర్కొన్నారు

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023లోని సెక్షన్ 40 (1), (2)లో పొందుపర్చిన అధికారాలను వినియోగించుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముసాయిదాను రూపొందించినట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అలాగే డేటా ప్రొటెక్షన్ బోర్డ్​ను రెగ్యులేటరీ బాడీగా ఏర్పాటు చేయాలని కూడా నిబంధనలు ప్రతిపాదించాయి.

నోటిఫికేషన్​లో ఇలా?

\"డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఛైర్​పర్సన్ పదవికి అభ్యర్థులను ఖరారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ, ఐటీ సెక్రటరీ, ఇతర నిపుణులు నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీ ఇతర బోర్డు సభ్యులను సిఫార్సు చేస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. సభ్యులను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది\" అని నోటిఫికేషన్​లో పేర్కొంది.

ముసాయిదాలో ఏమున్నాయంటే?

వ్యక్తులకు డేటా విశ్వసనీయత ద్వారా నోటీసు, సమ్మతి నిర్వాహకుని నమోదు, బాధ్యతలు, పిల్లల వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ మొదలైన వాటితో సహా చట్టంలోని వివిధ నిబంధనలను విడుదల చేశారు. డేటా ప్రొటెక్షన్ బోర్డు ఏర్పాటు, ఛైర్​పర్సన్, బోర్డులోని ఇతర సభ్యుల నియామకం, సేవా షరతులకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: