Responsive Header with Date and Time

ఆరోగ్యానికి వ‌రం సొంఠి..

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-01-06 11:13:49


ఆరోగ్యానికి వ‌రం సొంఠి..

TWM News:-అల్లంకు ప్రతిరూపాన్ని సొంఠి అంటారు. ఆరోగ్యపరంగా అల్లం కంటే అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఈ సొంఠి. ఇందులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో సొంఠికు చాలా ప్రాధాన్యత ఉంది. అనేక వ్యాధులను తగ్గించడానికి ఎన్నో ఏళ్లుగా సొంఠిని వాడుతున్నట్టుగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా సొంఠి తీసుకుంటే శరీరంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. అవేంటో తెలుసుకుందాం.

సొంఠిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధుల‌ను నివారించ‌డంలో సొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు చేసినప్పుడు సొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో సొంఠి పొడి కలిపి తీసుకుంటే.. మేలు జరుగుతుంది. సొంఠిలో ఉండే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు.

సొంఠి మహిళలకు చాలా ప్రయోజనకరం. పీరియడ్స్ సమయంలో నొప్పులు, క్రాంప్స్ తగ్గించేందుకు సొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. సొంఠి తినడం వల్ల శరీరం మెటబోలింజం వేగవంతమవుతుంది అంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గించే ప్రక్రియలో సొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా సొంఠి సరైన పరిష్కారం అంటున్నారు.. సొంఠి తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

సొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జలుబు, దగ్గు, గొంతులో గరగర సమస్యలుంటే అద్భుతంగా పనిచేస్తుంది. సొంఠి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమౌతుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరమవుతాయి. సొంఠి వాతాన్ని సమతుల్యం చేస్తుంది. గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే.. గోరువెచ్చని నీటిలో సొంఠి పొడి వేసుకుని తాగితే.. ఉపశమనం లభిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: