Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-01-06 11:09:29
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తైందని ఇన్‌సైడ్ టాక్. రీసెంట్ గా ప్రభాస్ కు యాక్సిడెంట్ అవడం వల్ల షూటింగ్ కు హాజరుకాక పోవడంతో బ్రేక్ పడింది.మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సంక్రాంతికి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా డైరెక్టర్ మారుతి ఓ ఈవెంట్ లో ప్రస్తుతానికి రాజా సాబ్ గురించి ఏం చెప్పలేనని అన్నారు. అంతేకాదు సంక్రాంతికి అప్డేట్ వస్తుందా అంటే అలాంటిదేమీ లేదని, ఏదైనా ఉంటే తామే తప్పకుండా చెప్తామన్నాడు.దీంతో రాజా సాబ్ టీమ్ నుంచి సంక్రాంతికి డార్లింగ్ ఫ్యాన్స్ ఏమీ ఆశించనక్కర్లేదనే క్లారిటీ వచ్చేసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం కనీసం సినిమా నుంచి చిన్న పోస్టర్ అయినా రిలీజ్ చేస్తే బావుంటుందని ఆశ పడుతున్నారు. మరి డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం కోసం మారుతి ఏమైనా డెసిషన్ మార్చుకుంటాడేమో చూడాలి. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకుని తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని మారుతి ప్రయత్నిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న రాజా సాబ్ సినిమాను భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.