Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-01-06 11:06:57
TWM News:-యూట్యూబర్ అంకుశ్ బహుగుణా సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకున్నాడు. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో అతడు ఈ స్కామ్‌లో ఎలా చిక్కుకున్నారో వివరించాడు. ఇటువంటి మోసాలపై అవగాహన కల్పించడానికి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నట్లు చెప్పారు.
నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను, ఎందుకంటే నా వంటి అనుభవం ఎవరికీ రావద్దని నేను కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా గమనించే బలమైన అభిప్రాయాలు ఉన్న మంచి స్నేహితులు ఉండడం నా అదృష్టం. ‘నేను బాగున్నాను’ అని సందేశాలు పంపుతున్నప్పటికీ, నా ప్రవర్తనలో మార్పును గమనించారు, అని అంకుశ్ అన్నారు.
మీందరిలో చాలా మందికి ఈ సైబర్ స్కామ్‌ల గురించి తెలిసే ఉంటుంది, కానీ వీళ్ళు ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తారో నేను నా అనుభవలను పంచుకుంటున్నాను.వీడియోలో స్కామర్లు తనను ఎలా నడిపించారో, వ్యక్తిగత సమాచారం ఉపయోగించి తనను ఎలా భయపెట్టారో వివరించారు. ఈ స్కామర్లు పరిశోధన చేస్తారు, మీపై ప్రభావం చూపే విషయాలను చెబుతారు. ఇది ఎవరికీ ఎదురుకావద్దని నేను కోరుకుంటున్నాను, అని ఆయన చెప్పారు.నేను ఇంకా కొంత షాక్‌లోనే ఉన్నాను. నా డబ్బు కోల్పయాను. నా మానసిక ఆరోగ్యం కోల్పోయాను. ఇది నాకు జరిగింది అనే విషయం నమ్మలేకపోతున్నాను. నేను దాదాపు 40 గంటలపాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నాను, అని అంకుశ్ అన్నారు. ఈ స్కామ్‌లు చాలా వేగంగా మీకు అర్థం అవుతాయి. కానీ, నావంటి వారు దీనిని అర్థం చేసుకోలేకపోతే, ఇది ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేను.