ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్ సూపర్ హిట్ .. ‘సైంధవ్’ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
Category : |
Sub Category : వినోదం Posted on 2024-02-03 13:20:07
TWM News :- రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో ఓ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైంధవ్.
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో రుహానీ శర్మ, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలు పోషించారు. తన కూతురి ప్రాణం కాపాడడం కోసం ఓ తండ్రి చేసే పోరాటమే సైంధవ్. జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యాయి. అందులో ఓ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అదే సైంధవ్. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో రుహానీ శర్మ, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలు పోషించారు. తన కూతురి ప్రాణం కాపాడడం కోసం ఓ తండ్రి చేసే పోరాటమే సైంధవ్. జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. గత అర్దరాత్రి నుంచి ఈ మూవీ ప్రసారం అవుతుంది. అయితే ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యొచ్చు.
కథ విషయానికి వస్తే.. చంద్రప్రస్థ అనే కల్పితన నగరం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఇందులో సైంధవ్ కోనేరు.. అలియాస్ సైకో (వెంకటేష్) తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తుంటాడు. భర్త నుంచి విడిపోయిన మనో (శ్రద్ధా శ్రీనాథ్)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన సైంధవ్.. తన భార్యకు ఇచ్చిన మాట కోసం అక్కడ పనిచేయడం మానేస్తాడు. అయితే తన కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు సైంధవ్. అదే సమయంలో తన కూతురు అరుదైన జబ్బుతో బాధపడుతుంటుంది. ఆ పాపకు జబ్బు తగ్గాలంటే రూ. 17 కోట్ల ఇంజక్షన్ కావాలి. అయితే తన బిడ్డ లాగే మరికొందరు చిన్నారు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటారని తెలుసుకుంటాడు. అదే సమయంలో కొంతమంది టెర్రరిస్టుల ముఠా సైంధవ్ ను చూసి భయపడుతుంది. వారితో సైంధవ్ కు సంబంధం ఏంటీ ? చివరకు తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు ? అనేది సినిమా.
చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు వెంకీ. అయితే ఇన్నాళ్లు ఫ్యామిలీ స్టార్, కామెడీ కింగ్ గా చూసిన అడియన్స్ సైంధవ్ అంతగా క్లిక్ అవ్వలేదు. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారయణ్ సంగీతం అందించారు.