Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-01 17:43:19
TWM Live News : వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ పాలన 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆదాయం 50శాతం మేర పెరిగిందని తెలిపారు. అన్ని వర్గాలకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని.. GDP అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్ అంటూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేవలం ప్రజలు పన్ను రాయితీలతో పాటు వివిధ తగ్గింపుల ప్రకటనల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలకు సబ్సిడీల కోసం ఆత్రుతగా బడ్జెట్‌ను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కష్టజీవి దగ్గర నుంచి ఏసీ రూములో కూర్చొని ట్రేడింగ్ చేసే వారి వరకూ ప్రతి ఒక్కరూ బడ్జెట్‌లోని ప్రకటనల కోసం ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆర్థిక మంత్రి కూడా గంటల తరబడి బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్‌లో వినిపిస్తూ ఉంటారు. ఈ బడ్జెట్‌లో ఎన్నో వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ...
కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంట్ ఆవరణలో కేబినెట్ భేటీ అయి మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు సీతారామన్. బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఉండకపోవచ్చంటూ ఇప్పటికే ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పీఎం కిసాన్ సాయం పెంచుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు చమురు, వంటగ్యాస్ ధరల తగ్గింపుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.