Responsive Header with Date and Time

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-31 17:56:07


 TWM Live News :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో చదువుతోన్న ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ గురువారం (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించునున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు, రెండో విడత ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు, మూడో విడత ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్‌ కొనసాగుతాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. జనరల్‌ కోర్సుల్లో 3.21 లక్షల మంది విద్యార్ధులు, వొకేషనల్‌లో 94 వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఎంపీసీలో 2,17,714, బైపీసీలో 1,04,089 మంది విద్యార్థులు, వొకేషనల్‌ ఫస్టియర్‌లో 48,277, సెకండియర్‌లో 46,542 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌ పరీక్షలు రాయనున్నారు.

ఇక ఇంటర్‌ ఫస్టియర్‌లోని విద్యార్థులకు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఈ ఏడాది నుంచి తొలిసారిగా ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌వాల్యూస్‌ (పాత బ్యాచ్‌ బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు) పరీక్ష నిర్వహిస్తారు.



Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: