Responsive Header with Date and Time

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్...

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-31 16:40:13


నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్...

TWM Live News : ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు. 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం తెలిపింది. ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.

ఏపీ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరిగింది. డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్‌లపై చర్చించారు. దాదాపు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫారెస్ట్‌ రేంజర్‌ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేయనున్నారు.


కేబినెట్ నిర్ణయాలు...



డీఎస్సీ నోటిఫికేషన్విడుదలకు గ్రీన్సిగ్నల్‌, 6100 పోస్టుల భర్తీకి కేబినెట్ఆమోదం

 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు 


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్


ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం


YSR చేయూత నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన కేబినెట్


మేనిఫెస్టోలో హామీ మేరకు వరుసగా నాలుగో విడత YSR చేయూత అమలు

ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయితీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్ఆమోదం

500 లోపు జనాభా ఉన్న పంచాయతీలకూ సెక్రటరీల నియామకం

యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు

ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం

ఎక్రోన్ఎనర్జీ ఇండియా ప్రైవేట్లిమిటెడ్రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం

3350 మెగావాట్ల సోలార్ప్రాజెక్ట్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్కు ఆమోదం

న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం

ఏపీ ఇన్స్టిట్యూట్ఆఫ్లెజిస్లేచర్స్టడీస్అండ్ట్రైనింగ్సంస్థ ఏర్పాటుకు కేబినెట్ఆమోదం

అసైన్డ్భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం

డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్నిర్ణయం

సీఎం కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో 25 మంది హెడ్కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం

పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం

డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం



Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: