Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-03 10:49:00
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- కాఫీ మనకు ఇష్టమైన పానీయాలలో ఒకటి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి కాఫీ తాగే అలవాటు ఉంది. కాఫీ తాగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. పని చేస్తున్నప్పుడు ఎక్కువ మానసిక ఒత్తిడి గురైతే.. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మనకు రిలీఫ్ అనిపిస్తుంది. ఆనందం, మనశ్శాంతి లభిస్తుంది. ఈ కాఫీలో రకరకాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లాక్ కాఫీ. ఈ బ్లాక్ కాఫీని ఖాళీ కడుపుతో ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయో లేదో తెలుసుకుందాం. కొంతమందికి ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు మంచిదా చెడ్డదా? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అదనంగా ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కొంతమందికి కడుపులో పూత, పేగు రుగ్మతలు, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం మొదలైన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కొంతమంది బ్లాక్ కాఫీని ఇష్టపడతారు. అయితే ఇందులో కెఫిన్ ఉండటం వల్ల అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, బిగుతుగా అనిపించడం వంటి అజీర్ణ లక్షణాలకు కూడా దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గ్యాస్ట్రిటిస్, అల్సర్లు లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం కూడా మంచిది కాదు. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి కూడా వస్తాయి. బ్లాక్ కాఫీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగవద్దు. అలాగే ఎవరైనా తీవ్ర ఒత్తిడితో బాధపడుతుంటే బ్లాక్ కాఫీ తాగడం మానేయడం మంచిది. ఇది మీ ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.