Responsive Header with Date and Time

మిరాయ్ లో రానా ద‌గ్గుబాటి

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-03 10:48:33


మిరాయ్ లో రానా ద‌గ్గుబాటి

తెలుగు వెబ్ మీడియాన్యూస్:-హ‌నుమాన్సి నిమాతో ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు తేజ స‌జ్జ(Teదీంతో ఆ క్రేజ్ కాపాడుకోవ‌డానికి తేజ త‌న త‌ర్వాతి సినిమాల విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు. ప్ర‌స్తుతం కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో మిరాయ్సి నిమా చేస్తున్నాడు తేజ సజ్జ‌. ఈ సినిమాపై అంద‌రికీ చాలా మంచి అంచనాలున్నాయి.మంచు మ‌నోజ్విల‌న్ గా న‌టించ‌నున్న ఈ సినిమా గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ ఆస‌క్తిక‌ర స‌మాచారం వినిపిస్తోంది. మిరాయ్ లో టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రానా ఒక ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్టు యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. ముందుగా ఈ పాత్ర కోసం దుల్క‌ర్ సల్మాన్  ను అనుకున్నార‌ట‌.కానీ దుల్క‌ర్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల మిరాయ్ సినిమా కోసం త‌న డేట్స్ ను అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోయాడు. దీంతో ఆ క్యారెక్ట‌ర్ రానా ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా తేజ‌తో మంచి బాండింగ్ ఉన్న రానా తేజ అడ‌గ్గానే ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.


 

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: