Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-04-03 10:39:11
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- గుజరాత్ లోని దీసా పట్టణంలో మంగళవారం బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంబంవించింది.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 21 చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఐదుగురు పిల్లలు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని హర్దా, దేవాస్ జిల్లాల నుండి వచ్చిన కార్మికులుగా అధికారులు నిర్దారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గోడౌన్‌లోని బాయిలర్ పేలడంతో పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. పేలుడు ధాటికి గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టుగా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.