Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-03 10:40:03
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిల్హీ రోగా సుధీష్ శంకర్ద ర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మారీసన్ ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ తో పాటూ వడివేలు కూడా హీరోగా నటిస్తున్నాడు. మామన్నన్తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మారీసన్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. జులైలో మారీసన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. మారీసన్ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. నెట్‌ఫ్లిక్స్ కు ఇది చాలా గొప్ప ఛాన్స్. నెట్‌ఫ్లిక్స్ మారీసన్ రైట్స్ ను కొనడంతో సబ్‌స్క్రైబర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫాహద్ కు ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.వారికి కూడా మారీసన్ రీచ్ అవాలంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్ ఫ్లిక్స్ తప్ప మరో బెస్ట్ ఆప్షన్ లేదు. ఇలాంటి సినిమాలు ఎక్కువ సబ్‌స్కైబర్లు ఉన్న ప్లాట్ ఫామ్స్ లో రిలీజైతేనే ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేకపోతే సినిమాకు ఎంత హైప్ ఉన్నా ఓటీటీలో మాత్రం రెస్పాన్స్ ఆశించిన విధంగా ఉండదు.