Responsive Header with Date and Time

టీడీపీ నామినేటెడ్‌ పోస్టుల: మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:14:27


టీడీపీ నామినేటెడ్‌ పోస్టుల:  మరో 50 ఏఎంసీలకు నేడో రేపో చైర్మన్లు!

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- టీడీపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల నియామకానికి టీడీపీ అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వస్తోంది. మొత్తం 218 ఏంఎసీల్లో తొలి విడతగా గత నెల 28న 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తిచేసేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో పార్టీ అధినేత చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని ఆచితూచి అడుగు వేస్తుండడంతో కాస్త జాప్యం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం కోసమే విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటే దేవాయలయ కమిటీలనూ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎ్‌స)ల భర్తీపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,250 పీఏసీఎ్‌సలు ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నామినేటెడ్‌ చైర్మన్లు లేదా పర్సన్‌ ఇన్‌చార్జులతో నడిపిస్తున్నారు.

సీఎంతో వంగవీటి రాధా భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబును వంగవీటి రాధాకృష్ణ సచివాలయంలో కలిశారు. బుధవారం సాయంత్రం సుమారు అరగంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో రాధా పేరు ఉంటుందని భావించారు. కానీ ఖాళీ అయిన ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరొకటి కేటాయించడంతో ఆయనకు ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నామినేటెడ్‌ పదవుల భర్తీ జరుగుతుండడంతో రాధాకు నామినేటెడ్‌ పోస్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపైనే రాధా పార్టీ అధినేతను కలిసినట్లు సమాచారం.



Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: