Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-03 10:14:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- రాష్ట్రంలో ఎక్కువ పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగు తున్న మార్కెట్ కమిటీల్లో కర్నూలుకు మొదటి స్థానం లభిం చడంతో పాటు లక్ష్యానికి మించి సెస్సు వసూళ్లు జరిగాయి. మార్చి నెలాఖరుకు కర్నూలు మార్కెట్ కమిటి నుంచి రూ.7.60 కోట్ల సెస్సును సాధించాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని మించి రూ.కోటి అదనంగా రూ.8.40 కోట్లు సెస్సును సాధించి కర్నూలు మార్కెట్ కమిటి అధికారులు, సిబ్బంది ప్రభుత్వంతో శభాష్ అనిపించుకున్నారు. సెస్సు ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో రాబట్టేందుకు రైతులు తెచ్చిన కందులతో పాటు వేరుశనగ, వాము, ఉల్లి తదితర పంటలు ఎక్కువ మొత్తంలో రైతులు విక్రయా నికి తెచ్చినందువల్లే సాధ్యమైందని సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలి పారు. బుధవారం కర్నూలు మార్కెట్ కమిటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్చి నెలాఖరుకు కర్నూలు మార్కె ట్ కమిటి సాధించిన సెస్సు ఆదాయ వివరాలను వివరించారు. వేరుశనగ నుంచి రూ.1.17 కోట్లు, కందుల నుంచి రూ.1.93 కోట్లు, వాము నుంచి రూ.1.19 కోట్లు, ఉల్లి నుంచి రూ.1.61 కోట్లు, ఎండుమిర్చి నుంచి రూ.65 లక్షలు, ఇతర మార్గాల ద్వారా రూ.1.16 కోట్లు మొత్తం రూ.8.40 కోట్లు సెస్సును సాధించామని సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.ఽ ధాన్యం నుంచి రూ.2 లక్షలు, బియ్యం నుంచి రూ.11 లక్షలు, పొద్దుతిరుగుడు నుంచి రూ.2.77 లక్షలు, పత్తి నుంచి రూ.1.54లక్షలు, శనగల నుంచి రూ.8.15 లక్షలు, ఆముదం నుంచి రూ.35.38 లక్షలు, జొన్నల నుంచి రూ.19వేలు, మొక్కజొన్న నుంచి రూ.6.09 లక్షలు ఆదాయం చేకూరినట్లు తెలిపారు. లక్ష్యానికి మించి ఆదాయాన్ని సాధించడంలో అధికారులు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు ఎంతో శ్రమించారన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నాగేష్, శివన్న, అకౌంటెంట్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.