Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-03 10:11:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ రోజును ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వచించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు.
ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. యూఎస్‌కు దిగుమతయ్యే అన్నిదేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.