Responsive Header with Date and Time

ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటన.. భారత్‌పై ఎంతంటే.?

Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-03 10:08:29


ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటన.. భారత్‌పై ఎంతంటే.?

తెలుగు వెబ్ మీడియా న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్‌ సంతకాలు చేశారు. ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు..ట్రంప్‌. ఈ రోజును ‘లిబరేషన్‌ డే’గా అభివర్ణించిన ట్రంప్‌..అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించిందని చెప్పారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డ ట్రంప్‌.. ఇక అలా జరగదని స్పష్టం చేశారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తాము కూడా తప్పకుండా సుంకాలు విధిస్తామని..అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేబినెట్‌ సభ్యులతో పాలు స్టీల్‌, ఆటో కార్మికులను కూడా ఆహ్వానించారు..ట్రంప్‌.

భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు..ట్రంప్‌. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు..అమెరికా అధ్యక్షుడు. తనకు మోదీ మంచి స్నేహితుడని కానీ అమెరికాతో భారత్‌ సరైనవిధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. తమ ఉత్పత్తులపై భారత్‌ 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు..ట్రంప్‌. అలాగే చైనాపై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.

వాణిజ్యంలో కొన్నిసార్లు శత్రువు కంటే స్నేహితుడు చాలా ప్రమాదకరమన్నారు ట్రంప్‌. దిగుమతి చేసుకుంటున్న ఆటో మొబైల్స్‌పై అమెరికా కేవలం 2.4 శాతం సుంకాలు మాత్రమే విధిస్తోందని..కానీ కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై భారీ టారిఫ్స్‌ అమలు చేస్తున్నాయన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బైక్స్‌పై భారత్‌ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయని మండిపడ్డారు. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం విధిస్తున్న టారిఫ్‌తో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు..ట్రంప్‌. విదేశీ మార్కెట్లకు ద్వారం తెరుస్తామని..దాంతో అమెరికాలో పోటీతత్వం పెరిగి తక్కువ ధరల్లో వస్తువులు లభిస్తాయని చెప్పారు.

పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు ఇలా..

భారత్‌: 26 శాతం

చైనా: 34 శాతం

ఈయూ: 20 శాతం

తైవాన్‌: 32 శాతం

జపాన్‌: 24 శాతం

దక్షిణ కొరియా: 25 శాతం

థాయిలాండ్‌: 36 శాతం

స్విట్జర్లాండ్‌: 31 శాతం

ఇండోనేషియా: 32 శాతం

మలేషియా: 24 శాతం


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: