Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-03 10:08:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- సరిగ్గా 50 ఏండ్ల క్రితం తొలి వన్డే ప్రపంచకప్‌ను నెగ్గి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఈ ఏడాది స్వర్ణోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. దిగ్గజ సారథి క్లైవ్ లాయిడ్ సారథ్యంలో ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా 1975, జూన్ 21 వెస్టిండీస్ ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి మొదటి ప్రపంచకప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్)ను గెలుచుకుంది. దీనిపై క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సీఈవో క్రిస్ డెహ్రింగ్ స్పందిస్తూ అవును. మేం స్వర్ణోత్సవ పండుగ చేసుకోబోతున్నాం. అయితే ఇందుకు సంబంధించిన తేదీ, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం అని తెలిపాడు. ఈ ఏడాది జూన్ 25న బార్బడోస్‌లో ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు సమాచారం.