Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-03 10:06:20
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-పాకిస్థాను ఇప్పటికే టీ20ల్లో చిత్తు చేసిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్లోనూ పైచేయి సాధించింది. బుధవారం రెండో వన్డేలో కివీస్ 84 పరుగుల తేడాతో పాకన్ను ఓడించి, మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
హామిల్టన్: మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ హే (99 నాటౌట్; 78 బంతుల్లో 7×4, 7x6)తో పాటు మహ్మద్ అబ్బాస్ (41) సత్తాచాటడంతో మొదట కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు రాబట్టింది. అనంతరం కివీస్ పేసర్లు బెన్ సీర్స్ (5/59), జాకబ్ డఫీ (3/35) విజృంభించడంతో పాక్ 41.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. చివర్లో ఫహీమ్ అప్రాఫ్ (73; 80 బంతుల్లో 6x4, 3x6), నసీమ్ షా (51; 44 బంతుల్లో 4x4, 4x6) పోరాడకపోతే పాక్ ఇంకా చిత్తుగా ఓడేది. శనివారం మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే కివీస్.. పాక్ తో టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.