Responsive Header with Date and Time

అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..! ఆరోగ్యానికి మంచిది కాదు..!

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-03 10:03:32


అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..! ఆరోగ్యానికి మంచిది కాదు..!

తెలుగు వెబ్ మీడియా న్యూస్:-స్నానం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానం సమయంలో శరీర ఉష్ణోగ్రత మార్పులు చోటుచేసుకోవటంతో వెంటనే నీరు తాగితే గుండెపై ఒత్తిడి పెరిగి తలనొప్పి, నీరసం, అలసట వంటి సమస్యలు రావచ్చు. అదే విధంగా, భోజనం చేసిన వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ దెబ్బతిని అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడే అవకాశముంది. ఎండలో ఎక్కువ సమయం గడిపిన తర్వాత కూడా వెంటనే చల్లటి నీరు తాగడం శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గించి తలనొప్పి, జలుబు, జ్వరం వంటి సమస్యలకు కారణమవుతుంది.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నీరు తాగే సరైన సమయాన్ని పాటించాలి. స్నానం చేసిన 10-15 నిమిషాల తర్వాత, భోజనం చేసిన 30-45 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగడం మంచిది. అదే విధంగా, ఎండలో గడిపిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ తీసుకుని గోరు వెచ్చటి నీరు తాగడం ఉత్తమం. వ్యాయామం చేసిన వెంటనే చల్లటి నీరు తాగకుండా గోరు వెచ్చటి నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడమే కాకుండా అనవసర ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: