Responsive Header with Date and Time

సెమీస్ లో జదుమణి

Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-03 10:02:57


సెమీస్ లో జదుమణి

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- భారత బాక్సర్ జదుమణి మండెంగ్బామ్ (50కేజీ) ప్రపంచకప్ బాక్సింగ్ కప్ సెమీఫైనల్క దూసుకెళ్లాడు. 20 ఏళ్ల ఈ జాతీయ ఛాంపియన్ క్వార్టర్ఫైనల్ బౌట్లో 3-2తో బ్రిటన్కు చెందిన ఎలిస్ ట్రోబిడ్జ్ప విజయం సాధించాడు.

దిల్లీ: జదుమణి సెమీస్ లో అసిల్బెక్ జలిలోవ్ (ఉస్బెకిస్థాన్)తో తలపడతాడు. మరో ముగ్గురు భారత బాక్సర్లు నరేందర్ బెర్వాల్ ((90+ కేజీ), నిఖిల్ దూబె (75కేజీ), జుగ్నూ (85 కేజీ) క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలయ్యారు. నరేందర్ 2-3తో సపారే బే (ఉజ్బెకిస్థాన్) చేతిలో, నిఖిల్ 0-5తో బెలిని (బ్రెజిల్) చేతిలో ఓడారు. జుగ్నూ 1-4తో అబౌలాయె (ఫ్రాన్స్) చేతిలో కంగుతిన్నాడు. ఇంకా మనీష్ రాథోడ్ (55 కేజీ), అభినాష్ (65 కేజీ), హితేశ్ (70కేజీ) బరిలోకి దిగాల్సివుంది. ఈ టోర్నీ కోసం భారత్ 10 మందితో కూడిన జట్టును పంపింది. తొలి రోజు లక్ష్య చాహర్ (80కేజీ) తొలి రౌండ్లో ఓడిపోయాడు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: