Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-02 10:31:30
తెలుగు వెబ్ మీడియా న్యూస్:రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదని.. ప్రజలను హింసించే పాలన అని భారాస రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. \'హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇళ్లు, హెచ్సీయూలో పక్షుల గూళ్లు, నోరున్న జనంపైకి, నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్, మూసీలో, హైడ్రాలో మూటల వేట, ఆఖరికి హెచ్సీయూలోనూ కాసుల వేట, అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణుల హాహాకారాలు, చదువులు చెప్పే చోట విధ్వంసం, విలువగల భూములపై వికృత క్రీడ, భావిభారత భవిష్యత్ విద్యార్థులతో ఆటలా?.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఇందిరమ్మ రాజ్యం.. జాగో తెలంగాణ జాగో!\' అని కేటీఆర్ పేర్కొన్నారు.