Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-02 10:23:44
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ప్రస్తుతం ముంబైలో నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరోయిన్ తమన్నా తమ ఇంట్లో మాతా కీ చౌకీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. నవరాత్రుల్లో భాగంగా మాతా కీ చౌకీ చేస్తారనే విషయం తెలిసిందే. పూజ అయిపోయాక తమన్నా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.తమన్నా ఇంట్లో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ఆమె ఫ్రెండ్, రవీనా టాండన్ కూతురు రషా తదానీ కూడా హాజరైంది. పూజ తర్వాత వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. వీడియో మొత్తం మీద తమన్నా, రషా తదానీ వేసిన డ్యాన్సులే హైలైట్ గా నిలిచాయి. రషా తదానీ, తమన్నా మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అందుకే రషా ఇంట్లో హోళీ వేడుకలకు తమన్నా కూడా హాజరైంది.ఇదిలా ఉంటే తమన్నా షేర్ చేసిన ఈ వీడియోలో ఎక్కడా ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కనిపించలేదు. దీంతో బాలీవుడ్ లో వీరి బ్రేకప్ పై వినిపిస్తున్న వార్తలు నిజమేనని అర్థమవుతుంది. తమన్నా సినిమాల విషయానికొస్తే అమ్మడు ప్రస్తుతం ఓదెల2 సినిమా చేస్తోంది. తమన్నా నాగసాధువుగా కనిపించనున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా, ఏప్రిల్ 17న ఓదెల2 ప్రేక్షకుల ముందుకు రానుంది