Category : అంతర్జాతీయ | Sub Category : టెక్నాలజీ Posted on 2025-04-02 10:20:42
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : గాల్లో తేలిపోవాలని వుందా. ఐతే చలో చైనా. ఇక్కడ మనం గాలి పటాలు ఎగిరేసినంత ఈజీగా అక్కడ గాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివేయండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6జీ నెట్‌వర్క్ , క్వాంటమ్ కంప్యూటింగ్, వంటి వాటితో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బ్లింప్స్.. ఫ్లయింగ్ కార్లను ప్రమోట్ చేస్తోంది చైనా . ఈహ్యాంగ్ హోల్డింగ్స్, హెఫీ హే రెండు ఎయిర్ లైన్ సంస్థలు ఫ్లయింగ్ ట్యాక్స్ పర్మిషన్ దక్కించుకున్నాయి. అర్బన్ ఏరియాల్లో , టూరిస్ట్ స్పాట్లలో ఫ్లయింగ్ ట్యాక్సీల సందడి అల్రెడీ మొదలైంది. స్థానికులే కాదు విదేశీయులు కూడా ఫ్లయింగ్ ట్యాక్సీలను చూసి ఫిదా అవుతున్నారు. గమ్మత్తుగా వుందని గాల్లో తేలిపోతున్నారు.
గాల్లో ఎగిరే వాళ్లకు ఆనందం. ఫ్లయింగ్ ట్యాక్సీ ఆపరేటర్లకు ఆదాయమే ఆదాయం. ఆదిలోనే క్రేజ్ అదిరిపోతుంది. ఫ్లయింగ్‌ట్యాక్స్ ప్రాజెక్ట్‌తో దండిగా రాబడి పెంచుకునేలా ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది చైనా. గాల్లో ఎగిరే ఈ ఫ్లయిట్లను చూసి అబ్బురపడిన అరబ్బులు అల్రెడీ బారీగా ఆర్డర్లు ఇచ్చారనేది టాక్.