Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-02 10:20:33
తెలుగు వెబ్ మీడియా న్యూస్:తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌రోకో ఘటనలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు లో విచారణ జరిగింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్ లో రైల్‌రోకో చేపట్టారు. ఆ సమయంలో కేసు నమోదు చేసి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండిరగ్‌లో ఉంది. కేసీఆర్ పిలుపు మేరకే రైల్‌రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే, రైల్‌రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు వినన్న న్యాయస్థానం రైల్‌రోకో ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులివ్వాలని ఆదేశించింది.