Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-02 10:20:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్: మలేషియాలో భారీ విస్ఫోటనం సంభవించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలో రాష్ట్ర ఇంధన సంస్థ పుత్రా హైట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో గ్యాస్ పైప్‌లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిసింది.
అయితే పేలుడి ధాటికి సమీప ఇళ్లులు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. గోడలు పగిలిపోయాయి. ఇక రంగంలోకి దిగిన అధికారులు.. సమీప నివాసాలను ఖాళీ చేయించారు.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.