Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-02 10:18:45
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ పొటాషియం మెగ్నీషియం కాపర్ మాంగనీస్ విటమిన్ బి 6, కెలు ఉన్నాయి. శరీరానికి ఇవి చాలా మంచిది. వీటిని తింటే రక్తపోటుని కంట్రోల్ చేసి ఎముకలని ఆరోగ్యంగా చేస్తాయి. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ వీటిని అందరూ ఒకేలా తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గర్భిణీలు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
ఖర్జూరం తినడం వల్ల కేవలం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే వీటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఖర్జూరం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ ఎండు ఫలాన్ని సరైన పరిమాణంలో సరైన విధానంలో ఆహారంలో చేర్చుకుంటే మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుంది. అయితే కొంతమందికి ఖర్జూరం తినడం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని మీకు తెలుసా? ఈ పండు వల్ల ఏర్పడే కొన్ని సమస్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
కిడ్నీవ్యాధులుంటే ఎందుకు తినకూడదు?
మీరు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించకుండా ఖర్జూరాన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం మానుకోవాలి. ఖర్జూరాన్ని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని గమనించాలి. కాబట్టి ఊబకాయం నుండి బయటపడాలనుకునేవారు ఖర్జూరం తినడాన్ని లిమిట్ లో మాత్రమే ఉంచుకోవాలి.
డయేరియా ఉన్నవారు..
మీకు డయేరియా సమస్య ఉన్నట్లయితే ఈ పండును తినడం మానేయాలి. ఖర్జూరంలో ఉండే కొన్ని పదార్థాలు డయేరియా సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. అదే సమయంలో దీనిని అతిగా తినడం వల్ల మలబద్ధకం కూడా పెరిగే ప్రమాదం ఉంది.
గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి
గర్భం దాల్చిన సమయంలో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. గర్భిణీ స్త్రీలు ఖర్జూరాన్ని అధికంగా తినకూడదు. మీరు గర్భవతి అయితే వైద్యుడి సలహా లేకుండా ఈ ఎండు పండును తినడం మానుకోవాలి. అలాగే ఖర్జూరం తినడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా దీనిని ఆహారంలో భాగం చేయకూడదు.
డయాబెటిస్ రోగులకు..
డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాన్ని నిత్యం తినడం మానుకోవాలి. ఖర్జూరంలో సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి దీని గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లూకోజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మ వ్యాధులు లేదా ఆస్తమా సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఎండు పండును తినకూడదు. ఖర్జూరంలో ఉండే బూజు అలర్జీలు ఆస్తమా రోగుల్లో 70-80% మందిని ప్రభావితం చేస్తాయి. ఇవి చర్మంపై దద్దుర్లు కూడా కలిగించవచ్చు.