Responsive Header with Date and Time

ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? శరీరంలో ఏమౌతుందో తెలుసుకోండి..

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-02 10:15:21


 ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? శరీరంలో ఏమౌతుందో తెలుసుకోండి..

తెలుగు వెబ్ మీడియా న్యూస్:  ఆకు కూరల్లో ఎక్కువగా వినిపించే పేరు పాలకూర..ఇది అద్భుతమైన ఆకుకూర. ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా నిండివున్న పాలకూరలో మరెఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్‌గా పాలకూర తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలకూర తినటం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. కండరాల పనితీరు మెరుగవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె కళ్ళుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కలిగే ఇతర ఆరోగ్యలాభాలు ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

పాలకూరలో ఫోలేట్ సమృద్దిగా ఉంటుంది. దీని వలన కణాల పెరుగుదల మెరుగవుతుంది DNA సంశ్లేషణకు అవసరమైన B విటమిన్ ఇందులో సమృద్దిగా ఉంటుంది. తక్కువ కేలరీలు అధిక పోషక విలువలు కలిగి ఉండటంతో పాలకూర ఆరోగ్య ప్రయోజనాలకు నిలయంగా పిలుస్తారు.

పాలకూరలో విటమిన్‌ కె ఎ ఫోలేట్‌ ఐరన్ క్యాల్షియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి.. విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచి జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఫోలేట్ గర్భవతులకు శిశువుల అభివృద్ధికి అవసరం. రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.

పాలకూరలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. పాలకూరలోని ల్యూటిన్ మరియు జియాక్సంతిన్ వలన మాక్యులర్ డీజెనరేషన్ కంటిశుక్లం వంటి కంటిం సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచి పిల్లలు తరచుగా అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. పాలకూరలోని ఆక్సీకరణ నిరోధకాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.

పాలకూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. పాలకూరలో లుటీన్ జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వలన వయస్సు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పాలకూరలోని పోషకాలు రక్తపోటును నియంత్రించి గుండెకు మేలు చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: