Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-02 10:08:53
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- బొప్పాయి తినడంతో పాటు చర్మానికి కూడా అప్లై చేసుకోవచ్చునని బ్యూటిషీన్లు చెబుతున్నారు. బొప్పాయితో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం మీ ముఖంపై బొప్పాయిని అప్లై చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు..అందమైన, పట్టులాంటి మెరిసే చర్మానికి బొప్పాయి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.బొప్పాయి చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను ఉంచుతాయి. బొప్పాయిని చర్మానికి రాయడం వల్ల చర్మంపై పగుళ్ల సమస్య రాదు. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
బొప్పాయిలో విటమిన్ ఏ మొటిమలను తగ్గిస్తుంది. బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ మొటిమల మచ్చలు, మోచేతులు, మోకాళ్లపై వంటి నల్లటి చర్మపు మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. చర్మం దురద, ఎరుపుదనాన్ని తగ్గించడంతో బొప్పాయి సహాయపడుతుంది. బొప్పాయిలో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మృతకణాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం క్లీన్ అవుతుంది.
బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. బొప్పాయి తింటే చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. మృతకణాలు తొలగుతాయి. బొప్పాయి గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల ఫేసియల్ హెయిర్ తగ్గుతుంది. ఈ ప్యాక్‌ను క్రమంతప్పకుండా వాడితే ముఖంపై అవాంచిత రోమాలు మాయం అవుతాయి. బొప్పాయి చర్మంపై మచ్చలు, ట్యాన్ తొలగించడంలో సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల మొటిమల వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయి.