Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-02 10:04:43
తెలుగు వెబ్ మీడియా న్యూస్:చేపల పులుసు ఎంతో రుచికరమైన వంటకం, అయితే సాధారణంగా దీనికి చింతపండు ఉపయోగిస్తారు. కోనసీమలో మాత్రం మామిడి కాయతో ప్రత్యేకమైన చేపల పులుసును తయారు చేస్తారు. దీని కోసం ముందుగా చేపలను ఉప్పు, నిమ్మరసం, కారం, పసుపుతో మారినేట్ చేసి పక్కన పెట్టాలి. మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించి గుజ్జుగా తయారు చేసుకోవాలి. ఉల్లిపాయలను పేస్ట్ చేసి, నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం కలిపి మసాలాను సిద్ధం చేయాలి.
తర్వాత మరిగిన మసాలలో చేప ముక్కలు జాగ్రత్తగా వేసి తక్కువ మంటపై ఉడికించాలి. నూనె పైకి తేలిన తర్వాత మామిడి కాయ గుజ్జు, కొబ్బరి పాలు వేసి పావుగంట ఉడికించాలి. చివర్లో కొత్తిమీర జల్లుకుని మూత పెట్టి ఉంచితే రుచికరమైన, చింతపండు లేకుండా తయారైన మామిడి కాయ చేపల పులుసు సిద్ధం!