Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-02 09:54:55
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- టీమ్స్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనుందని సమాచారం. శ్రేయస్ దేశవాళీ క్రికెట్ ఆడనందుకు ఆగ్రహించిన బోర్డు.. నిరుడు అతడికి కాంట్రాక్ట్ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ కూడా అదే కారణంతో కాంట్రాక్ట్ కోల్పోయాడు.
ముంబయి: ఆ తర్వాత తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్.. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయిదు మ్యాచ్ల్లో 243 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లోనూ అతడు విశేషంగా రాణించాడు. ఈ రంజీ సీజన్లో అయిదు మ్యాచ్ శ్రేయస్ 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీలో 345 పరుగులతో నాలుగో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో అయిదు మ్యాచ్ 325 పరుగులు చేశాడు. సగటు 325 కావడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రేయస్కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనుందని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇషాన్ కిషన్ కు మాత్రం కాంట్రాక్ట్ సందేహమే అని సమాచారం. టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఎ+ గ్రేడ్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు ఎ+ గ్రేడ్ (రూ.7 కోట్లు) ఇస్తారు. నిరుడు కోహ్లి, రోహిత్తో పాటు జడేజా, బుమ్రాలకు మాత్రమే ఆ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది.