Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-02 09:46:07
తెలుగు వెబ్ మీడియా న్యూస్:-ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 69), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 నాటౌట్) మెరుపు అర్ధసెంచరీలతో మంగళవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్‌కిది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), ఆయుష్ బదోని (33 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 41), మార్‌క్రమ్ (18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 28), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) రాణించారు. ఛేదనలో పంజాబ్ 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 నాటౌట్) చెలరేగాడు. స్పిన్నర్ దిగ్వే్‌షకు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ప్రభ్‌సిమ్రన్ నిలిచాడు.
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (బి) ఫెర్గూసన్ 28, మార్ష్ సి) జాన్సెన్ (బి) అర్ష్‌దీప్ 0, నికోలస్ పూరన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) చాహల్ 44, పంత్ (సి) చాహల్ (బి) మ్యాక్స్‌వెల్ 2, బదోని (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష్‌దీప్ 41, మిల్లర్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) జాన్సెన్ 19, సమద్ (సి) ఆర్య (బి) అర్ష్‌దీప్ 27, శార్దూల్ (నాటౌట్) 3, అవేశ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 171/7; వికెట్ల పతనం: 1-1, 2-32, 3-35, 4-89, 5-119, 6-166, 7-167; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-43-3, ఫెర్గూసన్ 3-0-26-1, మ్యాక్స్‌వెల్ 3-0-22-1, జాన్సెన్ 4-0-28-1, స్టొయినిస్ 2-0-15-0, చాహల్ 4-0-36-1.
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య (సి) శార్దూల్ (బి) దిగ్వేష్ రాఠి 8, ప్రభ్‌సిమ్రన్ (సి) బిష్ణోయ్ (బి) దిగ్వేష్ రాఠి 69, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 52, నేహల్ వధేరా (నాటౌట్) 43, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 16.2 ఓవర్లలో 177/2; వికెట్ల పతనం: 1-26, 2-110; బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 3-0-39-0, అవేశ్ ఖాన్ 3-0-30-0, దిగ్వేష్ రాఠి 4-0-30-2, రవి బిష్ణోయ్ 3-0-43-0, సిద్దార్థ్ 3-0-28-0, సమద్ 0.2-0-6-0.