Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 11:03:56
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- అదే వాటర్ బెల్. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ 8.45 గంటలకు ఒకసారి.. 10.50 గంటలకి రెండోసారి.. 11.50 గంటలకు మూడోసారి బెల్ మోగించి.. ఐదు నిమిషాల చొప్పున స్టూడెంట్స్ మంచి నీళ్లు తాగేందుకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి… వారు ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వేసవిని ఉంచుకుని తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై రోజూ మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.