Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:59:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఈ నెల 26న కొడాలి నాని హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.. అయితే గ్యాస్టిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు అప్పుడు ఆయన టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పరిస్థితి కాస్త సీరియస్ తాజాగా తెలుస్తోంది. ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే కొడాలి నానికి సడెన్‌గా ఏమైంది?.. అర్జెంట్‌గా ఆయన్ను ముంబై ఎందుకు తరలించారు?.. కొడాలి నానిని తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా?..
తీవ్ర అనారోగ్యంతో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. అయితే.. ఆయనకు గుండెలోనూ సమస్య ఉన్నట్లు తేల్చారు వైద్యులు. మూడు రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండడంతో సర్జరీ చేయాలని సూచించారు. గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ మూసుకుపోగా సర్జరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. హార్ట్ సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారు. దాంతో.. అత్యవసరంగా క్రిటికల్ సర్జరీ ద్వారా కొడాలి నాని హార్ట్‌కు స్టంట్స్ వేయడం కానీ.. బైపాస్ సర్జరీ కానీ చేయనున్నారు.
కొడాలి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇవాళ, రేపట్లో ముంబై ఆస్పత్రిలో వైద్యులు సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల వల్లభనేని వంశీ కేసు విచారణ సమయంలో విజయవాడ జిల్లా జైలు దగ్గర కొడాలి నాని చాలా యాక్టీవ్ కనిపించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యతో హైదరాబాద్ AIG ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. దీనిపై కొడాలి టీమ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయింది. కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతోనే బాధపడుతున్నారని.. ఆందోళన అవసరం లేదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. కొడాలి నానికి గుండెకు సంబంధించిన సమస్యలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.