Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-01 10:51:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఇండియన్ సినీ హిస్టరీలో వచ్చిన గొప్ప సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 కూడా ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శక్వంలో వచ్చిన ఈ మూవీ1991లో రిలీజై మంచి హిట్ గా నిలిచింది. ఇండియన్ సినిమాలో వచ్చిన మొదటి టైమ్ ట్రావెల్ సినిమా కూడా ఇదే. 30 ఏళ్ల తర్వాత ఆదిత్య 369 ఈ ఏప్రిల్ 4న తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కు రెడీ అయింది.రీరిలీజ్ సందర్భంగా కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చాలా ఇంప్రెస్సివ్‌గా ఉంది. ఈ మూవీలో శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య నటన, కంటెంట్ తో సింగీతం చేసిన మ్యాజిక్, అన్నింటినీ మించి ఇళయరాజా సంగీతం ఆ మూవీని ఇప్పటికీ క్లాసిక్ గా నిలబెట్టాయి. ఇదిలా ఉంటే బాలయ్య ఈ మూవీకి సీక్వెల్ చేస్తానని ఎప్పట్నుంచో చెప్తున్నాడు తప్పించి ఎప్పుడు చేస్తాడనేది మాత్రం చెప్పడం లేదు.టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా సీక్వెల్స్ వస్తున్న నేపథ్యంలో ఆదిత్య 369 సీక్వెల్ ను తెరకెక్కించడానికి ఇదే సరైన టైమ్ అని బాలయ్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎలాగూ స్టోరీ రెడీగానే ఉంది కదా ఆదిత్య 999 మ్యాక్స్ను సెట్స్ పైకి తీసుకెళ్లమని బాలయ్యను ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో పాటూ ఇప్పుడు సినిమా రీరిలీజవుతోంది కాబట్టి ఈ టైమ్ లో సీక్వెల్ ను అనౌన్స్ చేస్తే దానికి నెక్ట్స్ లెవెల్ క్రేజ్ రావడం ఖాయం.