Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-01 10:47:50
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు కు ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. తెలుగులో ఉన్న మేల్ యాంకర్లలో ప్రదీప్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిసినిమాను చేశాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రదీప్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.రీసెంట్ గా ప్రదీప్ ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపాడు. గతంలో ప్రదీప్ ఒకసారి హుషారు లోని ఉండిపోరాదే సాంగ్ ను పాడుతూ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని అడుగుతూ మీకు లవ్ కానీ, బ్రేకప్స్ కానీ ఉన్నాయా? ఎందుకు ఆ పాట పాడుతూ అంత ఎమోషనల్ అయ్యారు అని అడగ్గా దానికి ప్రదీప్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.అందరికీ ఉన్నట్టే తనక్కూడా సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో అదే నన్నే నన్నే చేరవచ్చె లాగా ఉండేదని, కాలేజ్ డేస్ లో అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి మనక్కూడా ఉండాలనే ఎగ్జయిట్‌మెంట్ తో ఉంటామని చెప్పిన ప్రదీప్, మెచ్యూరిటీ వచ్చాక అన్నీ వదిలేసి జీవితంపై ఫోకస్ చేసి లైఫ్ లో సెటిలైతే అన్నీ వాటంతటవే వస్తాయని రియలైజ్ అయ్యానని తెలిపాడు.