Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-01 10:43:20
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. అరకు కేఫ్ లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని పేర్కొన్నారు. పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇక్కడ కాఫీ ప్యాకేజింగ్‌ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిద్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు.