Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2025-04-01 10:27:23
తెలుగు వెబ్ మీడియా న్యూస్: బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి వేణు అందరికీ షాకివ్వడమే కాకుండా ఆ మూవీతో అందరినీ మెప్పించి ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. మొదటి సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజు బ్యానర్ లోనే వేణు తన రెండో సినిమాను కూడా చేయనున్నాడు. ఎల్లమ్మ టైటిల్ తో వేణు సినిమా తన బ్యానర్ లోనే ఉంటుందని దిల్ రాజు కూడా ఎప్పట్నుంచో చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.
ఎల్లమ్మ కథను వేణు ముందు నానికి చెప్పినప్పటికీ నాని ఆ కథ విని సంతృప్తి చెందకపోవడంతో ఆ కథను యంగ్ హీరో నితిన్ కు చెప్పి ఒప్పించాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్న నితిన్ దిల్ రాజు బ్యానర్ లో ఎల్లమ్మ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం వేణు ఎల్లమ్మ కోసం గత వారం సిరిసిల్ల నిజామాబాద్ తో పాటూ తెలంగాణలోని పలు ఏరియాల్లో పర్యటించాడని తెలుస్తోంది. ఎల్లమ్మ కోసం స్టేజ్ ఆర్టిస్టులను ఎంపిక చేయడానికి వేణు వెళ్లాడని ఆల్రెడీ కొంతమందిని సెలెక్ట్ కూడా చేశారని సమాచారం. ఈ సందర్భంగా వేణు కొన్ని నాటకాలను ప్రత్యక్షంగా చూసి మంచి టాలెంట్ ఉన్న వారిని ఎల్లమ్మ కోసం సెలెక్ట్ చేశాడని తెలుస్తోంది. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమా రిలీజయ్యాక ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లనుంది.