Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-01 10:25:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్: రాచరికాన్ని పునరుద్ధరించాలని, తమ రాజు జ్ఞానేంద్ర షా తిరిగి రావాలని కోరుతూ నేపాల్ ప్రజలు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజఽధాని ఖఠ్మాండూ వీధుల్లో వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. కొన్నేళ్లుగా దేశంలో కొనసాగుతున్న రాజకీయ అస్థిర పరిస్థితులతో విసిగిపోయామని, తమకు మిగిలివున్న ఆప్షన్ ‘రాజు తిరిగి రావడమే..’ అని ఆందోళనకారులు నినదిస్తున్నారు. నేపాల్‌లో దాదాపు రెండున్నర శతాబ్దాల పాటు కొనసాగిన రాచరిక పాలన 2008లో అంతమై.. ప్రజాస్వామ్య పాలన మొదలైంది. అనంతరం కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా అనేక ప్రభుత్వాలు మారాయి. రాజు జ్ఞానేంద్ర దిగిపోయిన తర్వాత ప్రజలు 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలను చూశారు. సంస్కరణలను అమలు చేయడానికి లేదా స్పష్టమైన దార్శనికత చూపేందుకు ఏ ప్రభుత్వం కూడా పదవీ కాలం చివరి వరకు కొనసాగలేదు. అవినీతి కుంభకోణాలు ఎక్కువయ్యాయి.