Responsive Header with Date and Time

ఘోర విషాదం.. ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్… ఏడుగురు సజీవ దహనం

Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-04-01 10:20:08


ఘోర విషాదం.. ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్… ఏడుగురు సజీవ దహనం

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- వెస్ట్ బెంగాల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సెఫ్టీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కానీ, అప్పటికే తీవ్ర నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంట్లో బాణా సంచా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

ఇంట్లోని రెండు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఇంట్లో ఎప్పటి నుంచో బాణాసంచా నిల్వ ఉందని.. దానికి మంటలు అంటుకుని పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: