Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-01 10:19:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ‘లివింగ్ నోస్ట్రాడమస్’ గా ప్రసిద్ధి చెందిన 38 ఏళ్ల బ్రెజిలియన్.. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అథోస్ సలోమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయన చెప్పిన విషయం విన్న తర్వాత ప్రపంచం వణికిపోయింది. ఎందుకంటే COVID-19, క్వీన్ ఎలిజబెత్ II మరణం, ఉక్రెయిన్‌పై రష్యా వినాశకరమైన దాడి వంటి సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేయడంలో ప్రసిద్ధి చెందాడు. దీంతో సలోమ్ ప్రపంచం ఒక పెద్ద సంక్షోభం అంచున ఉందని చెప్పడంతో వణికిపోతున్నారు.
మిర్రర్ UK నివేదించినట్లుగా.. సలోమ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం పెద్ద యుద్ధం ముందు ఉందని హెచ్చరించాడు. ఇటీవల సంఘటనలు ప్రపంచం సంఘర్షణ జరగబోతోందని చూపిస్తోందని ఆయన అన్నారు. దీనిని ‘భయంకరమైన భౌగోళిక రాజకీయ నమూనా’కు సంకేతంగా ఆయన అభివర్ణించారు. సంప్రదాయ పోరాటాలు కాకుండా కమ్యూనికేషన్ లైన్స్ కత్తిరించడం వంటి వ్యూహాలు, హైబ్రిడ్ వార్‌ఫేర్ దాడులు ఇప్పటికే ప్రపంచాన్ని గందరగోళం వైపు నెట్టివేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.