Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-01 10:09:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- వెస్టిండీస్ వన్డే జట్టు సారథి షై హోప్.. టీ20 జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆల్రౌండర్ రోమన్ పావెల్ నుంచి అతను బాధ్యతలు తీసుకోనున్నాడు.
సెయింటాన్స్: పావెల్ 2023 మే నుంచి విండీస్ టీ20 కెప్టెన్గా ఉన్నాడు. మరోవైపు జేసన్ హోల్డర్ తర్వాత నాలుగేళ్లుగా టెస్టు జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. జూన్-జులైలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో విండీస్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఆలోపు కొత్త కెప్టెన్ను ప్రకటించనున్నారు. తాను బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ముందే జట్టు సంధి దశను అధిగమించాలని బ్రాడ్వైట్ కోరుకున్నాడు. అది పూర్తి కాగానే రాజీనామాను ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్కు కొత్త నాయకత్వం రావాలని అతను భావించాడు. 100 టెస్టుల మైలురాయికి రెండు మ్యాచ్ల దూరంలో ఉన్న బ్రాత్వైట్కు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకం. అదనపు బాధ్యతలు లేకుండా ఈ సిరీస్ లో బ్యాటింగ్ మీద దృష్టిసారించాలనుకుంటున్నాడు. టెస్టు జట్టు ఎదుగులలో కీలక పాత్ర పోషించిన బ్రాత్వైట్కు కృతజ్ఞతలు. రాబోయే కొన్ని వారాల్లో కొత్త కెప్టెన్ ను ప్రకటిస్తాం అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పేర్కొంది.