Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-01 10:05:49
తెలుగు వెబ్ మీడియా న్యూస్:నేటి కాలంలో ఆరోగ్యంగా ఉండటం పెను సవాలుగా మారింది. మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం గుండె సమస్యలను పెంచుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు గుండెజబ్బులు ప్రభావం చూపుతున్నాయి. నిపుణుల ప్రకారం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం ఎంతో కీలకం. ముఖ్యంగా కొన్ని పండ్లు గుండెకు మేలు చేసే పోషకాలను అందిస్తాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తాయి. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండె సామర్థ్యం పెరుగుతుంది.
అవకాడోలు మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉండి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.