Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-01-19 16:46:09
ఇరాన్-పాకిస్థాన్ పరస్పర దాడుల తో ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ప్రతీకార చర్యకు ముందు అమెరికాను సంప్రదించినట్లు కధనాలు వచ్చాయి...
వాషింగ్టన్: తమ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులకు పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకొన్న సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్ ఈ దాడులకు ముందు అమెరికా ను సంప్రదించిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రచారంపై యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు
ఇరువర్గాలు సంయమనం పాటించాలి. ఘర్షణలను నివారించేందుకే దౌత్యమార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. నా దగ్గర ఎటువంటి ప్రైవేటు సంభాషణలు లేవు. ఉద్రిక్తతలను మరింత పెంచాల్సిన పనిలేదు. పొరుగుదేశాలతో సంబంధాల పట్ల పాక్ ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందనను మేం గమనించాం. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రికత్తల విషయంలో ఆందోళనగా ఉన్నాం.
కొద్దిరోజులుగా పొరుగుదేశాలపై ఇరాన్ చేసిన దాడుల విషయంలో మా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాం
ఉగ్రకార్యకలాపాలకు, పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమైన సుదీర్ఘ చరిత్ర టెహ్రాన్కు ఉంది. కానీ, మీడియా కథనాలపై మాత్రం వివరణ ఇవ్వలేదు.