Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-12 10:57:43
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌కింగ్ కప్‌లో భారత్ మూడో విజయం నమోదు చేసింది. గ్రూప్-1 ఆసియా ఓషియానాలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో చైనీస్ తైపీపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో వైదేహి 6-2, 5-7, 6-4తో ఫంగ్ అన్ లిన్‌ను చిత్తుచేసింది. మరో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6-2, 7-6 (7/3)తో గార్లాండ్‌ను మట్టికరిపించింది. డబుల్స్ పోరులో అంకిత-ప్రార్థన జోడీ ఓటమిపాలైంది.