Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : తాజా వార్తలు Posted on 2025-04-12 10:43:40
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్దులకు అలర్ట్.. ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు. అలాగే మన మిత్ర వాట్స్ యాప్ నంబర్ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌పెట్టి కూడా ఫలితాలు సులువుగా తెలుసుకోవచ్చు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు 26 జిల్లాల్లో మొత్తం 1535 కేంద్రాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ఇక ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరిగాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తైన కేవలం 20 రోజుల్లోనే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది.